: రోజా సభకు రావచ్చు... కానీ క్షమాపణలు చెప్పాలి!: యనమల
ముఖ్యమంత్రిపై వైకాపా శాసన సభ్యురాలు రోజా చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో విధించిన సస్పెన్షన్ గడువు ముగిసినందునే ఆమె అసెంబ్లీకి వస్తుంటే ఎవరూ అడ్డుకోవడం లేదని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. వెలగపూడి అసెంబ్లీ వద్ద ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, రోజా సభకు వచ్చి తెలుగుదేశం ఎమ్మెల్యే అనితకు క్షమాపణలు చెప్పాల్సి వుంటుందని, ఎటువంటి షరతులు లేకుండా ఆమె క్షమాపణలు చెప్పాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆమెపై అనిత చేసిన ఫిర్యాదుపై సభా హక్కుల కమిటీ నివేదిక రూపొందించిందిదని అన్నారు. రోజా బేషరతు క్షమాపణ చెప్పిన పక్షంలో, ఆమెపై తుది నిర్ణయం తీసుకునే హక్కును సభాపతికి వదిలివేయనున్నట్టు తెలిపారు. క్షమాపణలు చెప్పకుంటే, చర్యలు ఉంటాయని, అది ఏంటన్నది సభ నిర్ణయిస్తుందని అన్నారు.