: రెండున్నర నిమిషాల 'బాహుబలి: ది కన్ క్లూజన్' ట్రైలర్... అన్ని భాషల్లో ఒకేసారి విడుదల
సంచలనం సృష్టించిన 'బాహుబలి: ది బిగినింగ్' కలెక్షన్ల సునామీని దాటిపోయేలా రాజమౌళి తయారు చేస్తున్న 'బాహుబలి: ది కన్ క్లూజన్' చిత్రం మరో 50 రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో, చిత్రం ప్రమోషన్ పై దృష్టిని సారించిన దర్శక, నిర్మాతలు మొదట థియేటరికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. మొత్తం రెండున్నర నిమిషాల నిడివి వుండే ట్రైలర్ ఇప్పటికే సిద్ధం కాగా, సినిమా విడుదలయ్యే అన్ని భాషల్లోనూ దీన్ని రూపొందించి ఒకేసారి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు నటించిన చిత్రం పాటలను, ఈ నెలాఖరులో లేదా ఏప్రిల్ తొలి వారంలో విడుదల చేస్తామని చిత్ర వర్గాలు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.