: నువ్వు రెడ్డివే కాదు.. ఎలా పుట్టావు నువ్వు?: రాయలేని భాషలో జేసీపై చెవిరెడ్డి ఫైర్
విజయవాడలో సోమవారం వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ బూతులు లంకించుకున్నారు. వినలేని, పత్రికల్లో రాయలేని పదజాలం వాడుతూ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మాటలకు విలేకరులు సైతం అవాక్కయ్యారు. కొందరైతే చెవులు కూడా మూసుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విరుచుకుపడుతున్న జేసీపై చెవిరెడ్డి చిందులు తొక్కారు.
‘‘నువ్వు రాయలసీమ రెడ్డిగా ఎలా పుట్టావు? అసలు నువ్వు రెడ్డివో? కాదో? డీఎన్ఏ పరీక్ష చేయించాలి. నువ్వు మనిషి రూపంలో ఉన్న మృగానివి. నీ కంటే రాయలసీమలో పందులు నయం. నిన్ను చూస్తే పాస్ పోసే పిల్లాడు కూడా అది పోయడం మానేస్తాడు. అసలు ఏందిరా నీ సవాల్? జగన్‌కే సవాల్ విసిరేంత మగాడివిరా నువ్వు? పరిటాల రవికి జడిసి పారిపోతే అండగా నిలిచిన వైఎస్సార్ కుటుంబాన్నే నోటికొచ్చినట్లు తిడతావా..?’’ అంటూ బూతుల దండకం చదివారు. ఆయన తిట్లతో అక్కడున్నవారు అవాక్కయారు.