: ఒక ఐడీ బ్లాక్ చేస్తే... పది క్రియేట్ చేస్తా... దేవుళ్ల అంతు చూస్తా: సైబర్ నేరగాడి సవాళ్లు


సోషల్‌ మీడియాలో సైబర్ నేరగాడు పోలీసులతోపాటు ఇతరులకు సవాల్ విసురుతున్నాడు. అత్యంత సున్నితమైన దేవుళ్లపై విమర్శలు, వ్యాఖ్యలు చేస్తూ కలకలం రేపుతున్న ఈ సైబర్ నేరగాడు మార్ఫింగ్ చేసిన ఫోటోలను పోస్టు చేస్తూ కలకలం రేపుతున్నాడు. ఇన్‌ స్టాగ్రాంలో ఆ వ్యక్తి పోస్టు చేసిన అభ్యంతరకర పోస్టింగ్స్‌ ను చూసిన హైదరాబాదు, అబిడ్స్‌ ప్రాంతానికి చెందిన వ్యాపారి అతనిని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఒక వర్గాన్ని కించపరుస్తూ ప్రచారం చేస్తున్న ఆ అభ్యంతరకర పోస్టులను తొలగించాలని కోరుతూ ఆ వ్యాపారి ఇన్‌ స్టాగ్రాం యాజమాన్యాన్ని ఆశ్రయించాడు.

దీంతో వెంటనే స్పందించిన ఇన్ స్టాగ్రాం యాజమాన్యం అభ్యంతరకర పోస్టుల్ని చేస్తున్న ఐడీని బ్లాక్‌ చేశారు. అంతటితో ఆగని అబిడ్స్ వ్యాపారి... సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు అతని పోస్టులపై విచారణ ప్రారంభించారు. ఇంతలో బరితెగించిన ఆ సైబర్‌ నేరగాడు... ఏకంగా 17 ఫేక్ ఐడీలను క్రియేట్‌ చేసి వివిధ వర్గాలకు చెందిన దేవుళ్ళను కించపరుస్తూ పోస్టులు చేశాడు. అంతే కాకుండా ఆ ఫేక్ ఐడీలలో ఒకదానిలో ‘ఒక ఐడీని బ్లాక్‌ చేయిస్తే పది క్రియేట్‌ చేస్తా’ అంటూ సవాల్‌ కూడా విసిరాడు. దీంతో అతనిని పట్టుకునేందుకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు.  

  • Loading...

More Telugu News