: ఆ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతా..!: హైవే పనుల్లో జాప్యంపై చంద్రబాబు ఆగ్రహం
ఏపీలో హైవే పనులు సకాలంలో పూర్తి కాకపోవడంపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రేణిగుంట - కడప - రాయల చెరువు హైవే పనుల్లో జరుగుతున్న జాప్యంపై సదరు కాంట్రాక్టర్లను ఆయన హెచ్చరించారు. కేవలం 25 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారని, హైవే పనులను జూన్ నాటికి పూర్తి చేయకపోతే ఆ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతానని హెచ్చరించారు. ఈ పనుల్లో జాప్యం కారణంగా గాలేరు-నగరిలో నీటి నిల్వ సాధ్యం కావడం లేదని చంద్రబాబు అన్నారు.