: ‘కాటమరాయుడు’ వర్కింగ్ స్టిల్ విడుదల!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం పాటల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్నఈ చిత్రం పాటల షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. కాగా, ‘కాటమరాయుడు’ వర్కింగ్ స్టిల్ ను చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసింది. ఇందులో పవన్ కల్యాణ్ తో నిర్మాత శరత్ మరార్ ముచ్చటిస్తున్నారు. కాగా, ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు, టైటిల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న లేదా 29వ తేదీన ‘కాటమరాయుడు’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.