: 'మోదీజీ మన్ కీ బాత్ ఆపి... కామ్ కీ బాత్ కరో': అఖిలేష్ యాదవ్ హితవు


ఉత్తరప్రదేశ్ కు చివరి దశ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విమర్శల వేడి పెరుగుతోంది. ప్రధానంగా బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య విమర్శల అగ్గిరాజుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తూ సమాజ్ వాదీ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తుండడంతో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ప్రధానికి దీటుగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా జౌన్ పూర్ లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ, 'మోదీజీ! మన్ కీ బాత్ ఆపండి...మీ మనసులో మాటలు చాలా సార్లు చెప్పారు. అన్నీ విన్నాం...ఇప్పటికైనా కామ్ కీ బాత్ కరో...ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పండి' అని ఎద్దేవా చేశారు. అచ్చేదిన్ తీసుకొస్తామన్నారు...ఆ సంగతి ఏమైంది? అని నిలదీశారు.

యూపీని సమాజ్ వాదీ పార్టీ అభివృద్ధి చేసిందని ఆయన చెప్పారు. అంబులెన్స్, పోలీసు సేవల కోసం 100 నంబర్‌ ను కేటాయించామని తెలిపారు. అలాగే వైద్య కళాశాలను ఏర్పాటు చేశామని, రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్ లోని నగరాల్లో 22 గంటలు, పల్లెల్లో 14 నుంచి 18 గంటలు, ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. బీఎస్పీని ఎవరూ విశ్వసించవద్దని చెప్పిన ఆయన, ఆ పార్టీ బీజేపీతో కలిసే అవకాశం ఉందని అన్నారు. 

  • Loading...

More Telugu News