: ముఖ్యమంత్రి చంద్ర‌బాబు రాసిచ్చారు.. శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ చ‌దివి వినిపించారు: జ‌గ‌న్ విమర్శలు


అమ‌రావ‌తిలో నిర్మించిన అసెంబ్లీలో తొలి స‌మావేశాలు ప్రారంభం అయిన నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఓ వైపు క‌ర‌వులో అల్లాడిపోతోంటే అభివృద్ధిలో దూసుకుపోతోంద‌ని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు అంటున్నార‌ని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబు రాయించి ఇచ్చిన విష‌యాల్నే ఈ రోజు అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప్ర‌సంగించారని ఆరోపించారు. దేశం కంటే 5 శాతం ఎక్కువ‌గా ఏపీ అభివృద్ధిలో ప‌రుగులు తీస్తోందని ప్ర‌భుత్వం చెప్పుకుంటోంద‌ని జ‌గ‌న్ అన్నారు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారని ఆయ‌న ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు నాయుడు గ‌వ‌ర్న‌ర్ తో అవాస్తవాలు చెప్పించారని జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. గవర్నర్ ప్రసంగంపై రేపు శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడతానని అన్నారు.


  • Loading...

More Telugu News