: వరుసగా నాలుగో ఇన్నింగ్స్ లోనూ విఫలమైన కోహ్లీ... 15 పరుగులకే అవుట్


భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమై, అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చాడు. మంచి ఆధిక్యాన్ని సంపాదించాల్సిన స్థితిలో ఉన్న భారత జట్టును ఆదుకోవాల్సిన కోహ్లీ, కేవలం 15 పరుగులకే హాజిల్ వుడ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత్ మూడవ వికెట్ ను కోల్పోయినట్లయింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న ఛటేశ్వర్ పుజారా 28 పరుగులు చేయగా, అతనికి రవీంద్ర జడేజా వచ్చి కలిశాడు. రెండో ఇన్నింగ్స్ లో భారత స్కోరు ప్రస్తుతం 112/3 కాగా, ఆస్ట్రేలియా స్కోరుపై 25 పరుగుల లీడింగ్ ఉంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో సైతం కోహ్లీ 12 పరుగులకే అవుట్ అయిన సంగతి తెలిసిందే. అంతకుముందు తొలి టెస్టులోనూ స్వల్ప స్కోర్లకే కోహ్లీ వెనుదిరిగాడు.

  • Loading...

More Telugu News