: హాఫ్ సెంచరీ తరువాత లోకేష్ రాహుల్ అవుట్... ఆధిక్యంలోకి వచ్చిన భారత్
తనతో పాటు క్రీజులోకి వచ్చిన అభినవ్ ముకుంద్ 16 పరుగుల స్వల్ప స్కోరుకే వెనుదిరిగినప్పటికీ, లోకేష్ రాహుల్ నిలదొక్కుకుని ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆపై ఆస్ట్రేలియా తురుపు ముక్క, తొలి టెస్టులో భారత నడ్డి విరిచిన ఓకీఫీ బౌలింగ్ లో స్లిప్ లో ఉన్న స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో, భారత్ తన రెండో వికెట్ ను కోల్పోయింది. మరో ఎండ్ లో ఉన్న ఛటేశ్వర్ పుజారా కుదురుగా ఆడుతుండగా, అతనికి కోహ్లీ జతగా వచ్చి చేరాడు. భారత స్కోరు నెమ్మదిగా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం భారత స్కోరు 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు కాగా, రెండో ఇన్నింగ్స్ లీడ్ ప్రారంభమైంది.