: పవర్ స్టార్ సూచనలతో స్పందించిన మంత్రి నారాయణ... అధికారులపై ఆగ్రహం


నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే కదలాలని జనసేన అధినేత, హీరో పవన్‌ కల్యాణ్ చేసిన సూచనలపై ఏపీ మంత్రి నారాయణ స్పందించారు. వర్సిటీ వైస్ చాన్సలర్ వీరయ్య, రిజిస్ట్రార్ శివశంకర్‌ లపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరిస్థితులను చక్కదిద్దకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఇటీవల వర్శిటీ విద్యార్థులు పలువురు పవన్ ను కలిసి తమ సమస్యలపై ఏకరువు పెట్టిన సంగతి తెలిసిందే. వారు కాలినడకన బయలుదేరారని తెలుసుకున్న పవన్, విజయవాడ నుంచి వారిని వాహనాల్లో హైదరాబాద్ కు రమ్మని చెప్పి, వారితో మాట్లాడి, ఆపై ఏపీ ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు అందించారు.

  • Loading...

More Telugu News