: మూడు దశాబ్దాల పాటు గర్జించిన ఇన్సాస్ రైఫిళ్లకు విశ్రాంతి!



భారత సైన్యం చేతిలో దాదాపు 30 ఏళ్ల పాటు గర్జించిన ఇన్సాస్ రైఫిళ్లు మూగబోనున్నాయి. వ్యవస్థ నుంచి కనుమరుగు కానున్నాయి. 1988లో భారతీయ చిన్న ఆయుధాల వ్యవస్థ (ఇన్సాస్)ను భారత సైన్యంలో ప్రవేశ పెట్టారు. ఇప్పుడు ఈ రైఫిళ్ల స్థానంలో అత్యాధునిక (7.62x 51) ఆయుధాలు జవాన్ల చేతుల్లోకి రానున్నాయి. సైనికుల చేతుల్లో ఉన్న దాదాపు 2 లక్షల ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో అత్యాధునిక ఆయుధాలను ప్రవేశపెట్టనున్నారు. దీనికోసం, ఇప్పటికే వివిధ విదేశీ ఆయుధ తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న భారతీయ కంపెనీలు సహా మొత్తం 18 సంస్థలు ముందుకొచ్చినట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు పాకిస్థాన్ ఇప్పటికే అత్యాధునిక (7.62x51) రైఫిళ్లను జర్మనీ నుంచి కొనుగోలు చేసిందని వెల్లడించాయి.    

  • Loading...

More Telugu News