: ఇక్కడి విమానాశ్రయంలో ప్రధానిని దిగనివ్వం: బీజేపీ ఎమ్మెల్యే భవానీసింగ్ రజావత్


రాజస్థాన్‌లోని కోటలో ఇప్ప‌టికీ సరైన ఎయిర్‌పోర్టు లేదని బీజేపీ ఎమ్మెల్యే భవానీసింగ్ రజావత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ ప్రాంతం ఐఐటీ కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఆ ప్రాంతంలో పాస్‌పోర్ట్ స‌ర్వీస్ సెంట‌ర్‌ను ప్రారంభించిన భ‌వానీ సింగ్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... అక్క‌డి ప్ర‌జ‌ల‌ కోసం విమానాల స‌ర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చేవ‌ర‌కు ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ సహా ఏ వీవీఐపీని కూడా అక్కడ విమానాన్ని దిగనివ్వ‌బోమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అక్క‌డి ఎయిర్‌పోర్టులో విమానాలు లేకపోతే ఇక‌ పాస్‌పోర్టులు పెట్టుకుని జనం ఏం చేసుకుంటారని ఆయ‌న నిల‌దీశారు. అక్క‌డి ఎయిర్‌పోర్టు వీవీఐపీలు, రాజకీయ నాయకుల కోసమే ఉన్నట్లుందని ఆయ‌న మండిప‌డ్డారు. కోట‌లో చిన్న విమానాలు మాత్రమే ల్యాండ్ అవుతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు.  బీజేపీ ఎమ్మెల్యే భవానీసింగ్ రజావత్ కొన్ని రోజుల ముందు కూడా ప‌లుసార్లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

  • Loading...

More Telugu News