: నిలబడ్డ ఓపెనర్లు... వికెట్ నష్టపోకుండా లంచ్ వరకూ లాక్కొచ్చారు!
87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఆస్ట్రేలియా జట్టు ఆలౌట్ అయిన తరువాత, రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత జట్టు నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు లోకేష్ రాహుల్, అభినవ్ ముకుంద్ లు ఆచితూచి ఆడుతుండటంతో, మూడో రోజు లంచ్ విరామ సమయానికి వికెట్ కోల్పోకుండా 38 పరుగులు వచ్చి చేరాయి. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 49 పరుగులకు తగ్గింది. రాహుల్ 29 బంతుల్లో రెండు ఫోర్లతో 20 పరుగులు, ముకుంద్ 31 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ సాయంతో 16 పరుగులు చేశారు. ప్రస్తుతం భారత స్కోరు 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 38 పరుగులు.