: ఓటుకు నోటు కేసును విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు


గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేపిన ఓటుకు నోటు కేసులో వేసిన పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఆ పిటిషన్ ను విచార‌ణకు స్వీక‌రిస్తున్నట్లు తెలిపింది. ఓటుకు నోటు కేసులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబుకు ప్రత్యక్ష ప్రమేయముందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబును ప్రాసిక్యూట్ చేయాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. గతంలో ఈ కేసులో హైకోర్టులో చంద్ర‌బాబుకు ఊర‌ట ల‌భించింది. అయితే, తాజాగా సుప్రీం... ఆళ్ల వేసిన పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించడంతో ఆ కేసు అంశం తెర‌పైకి వ‌చ్చింది.

  • Loading...

More Telugu News