: అసెంబ్లీలోని తన ఛాంబర్ లో పూజలు నిర్వహించిన జగన్
అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రవేశించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఆయన తన ఛాంబర్ లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా, కార్యాలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి, ఆయన శాసనసభలోకి అడుగుపెట్టారు. మరోవైపు, అన్ని పార్టీలకు చెందిన సభ్యులతో అమరావతిలోని నూతన శాసనసభ కళకళలాడుతోంది.