: శాసనసభలో అడుగుపెట్టిన జగన్.. అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న రోజా
ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన కొత్త అసెంబ్లీ భవనంలో మరికాసేపట్లో తొలి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభం కాగానే గవర్నర్ నరసింహన్ ప్రసంగం ఉంటుంది. శాసనసభలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ అడుగుపెట్టారు. ఆయనతో పాటు పలువురు పార్టీ సభ్యులు ఉన్నారు. ఏడాదిపాటు సస్పెండ్ అయిన తరువాత రోజా ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆమె అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. మరోవైపు టీడీపీ సభ్యులు కూడా శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సమావేశాలు ఈ నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉంది.