: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. కరవు భత్యం పెంపు.. ఈ నెలాఖరులో ప్రకటన!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు త్వరలో కేంద్రం తీపి కబురు చెప్పనుంది. వారి కరవు భత్యాన్ని(డీఏ) 2 నుంచి 4 శాతానికి పెంచుతూ ఈ నెలాఖరులో ప్రకటన చేయనున్నట్టు సమాచారం. దీనివల్ల 50 లక్షల మంది ఉద్యోగులు, 58 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. పెంచిన డీఏను ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తింపజేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. అయితే డీఏను మరీ రెండు శాతం పెంచడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం నిర్ణయం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేదని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కేకేఎన్ కుట్టి ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది అక్టోబరులో 2 శాతం డీఏను పెంచిన ప్రభుత్వం దానిని జూలై 1 నుంచి అమలు చేసిన సంగతి తెలిసిందే.