: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా విన్నపం ఒకటే!: కోట శ్రీనివాసరావు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మంత్రులకు ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఓ విన్నపం చేశారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘తెలుగు సినిమాలలో తెలుగు నటులకు ప్రాధాన్యమివ్వండి. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మంత్రులకు నా విన్నపం ఏంటంటే.. నూటికి నూరు శాతం తెలుగువాళ్లతోనే ... అంటే, రచన, దర్శకత్వం, నటన, కెమెరా.. అన్ని క్రాఫ్ట్ ల లోనూ పూర్తిగా తెలుగు వాళ్లను పెట్టి తీసిన సినిమాలకే రాయితీలు ఇవ్వాలి. ఆ విధంగా చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుకుంటున్నాను’ అని కోట కోరారు.