: భర్తగా పవన్ కల్యాణ్ ఏవరేజ్ స్టూడెంట్ మాత్రమే!: రేణూ దేశాయ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ విడిపోయి చాలా కాలం అవుతోంది. అయినప్పటికీ, పవన్ గురించి ఆమె చెప్పే విషయాలకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ నెల 8న మహిళా దినోత్సవం నేపథ్యంలో ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్’లో భాగంగా పవన్ గురించి రేణూ దేశాయ్ చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
భర్తగా, తండ్రిగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా పది మార్కులకు పవన్ కల్యాణ్ కు ఎన్ని మార్కులు వేస్తారు? అనే ప్రశ్నకు రేణూ స్పందిస్తూ.. భర్తగా పవన్ ‘యావరేజ్ స్టూడెంట్’ అని, పదికి నాలుగు లేదా ఐదు మార్కులు మాత్రమే ఇస్తానని, తండ్రిగా పదికి వంద మార్కులు, నటుడిగా, రాజకీయ నాయకుడిగా పదికి పది మార్కులు వేస్తానని రేణూ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. మరి, భవిష్యత్ లో ఏం చేస్తారో తెలియదు గానీ, పవన్ ఆలోచనలు బాగున్నాయని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూ మహిళా దినోత్సవం రోజున ప్రసారం కానుంది. అయితే, ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.