: ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐ కొత్త నిబంధనలు అమలు!


ఏప్రిల్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నగదు డిపాజిట్లు, ఏటీఎంల నుంచి నగదు డ్రాపై ఛార్జీలు విధించనుంది. ఈ విషయాన్ని ఎస్బీఐ ఖాతాదారులు గుర్తుంచుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు. అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు ఇలా వున్నాయి.. ఎస్బీఐ ఏటిఎంల నుంచి ఐదు సార్ల వరకు నగదు డ్రా చేసుకోచ్చు. ఐదు సార్లకు పైబడితే రూ.10 చొప్పున ఛార్జి చేస్తారు. మూడు సార్ల వరకు నగదు డిపాజిట్లు ఉచితంగా చేసుకోవచ్చు. నాలుగో డిపాజిట్ కు సేవా పన్ను సహా రూ.50 ఛార్జి పడుతుంది.

ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మూడు సార్ల వరకు నగదు డ్రా చేసుకోవచ్చు. నాలుగో సారి డ్రా చేస్తే కనుక రూ.20 ఛార్జి విధిస్తారు. మెట్రో పాలిటన్ శాఖల్లో ఉన్న బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 5000 కంటే తక్కువగా ఉంటే  సేవా పన్నుతో పాటు రూ.100 జరిమానా విధించనున్నారు. మినిమమ్ బ్యాలెన్స్ కన్నా వినియోగదారుడి ఖాతాలో 50 శాతం తక్కువ మొత్తం ఉంటే సర్వీస్ ఛార్జీతో కలిపి రూ.50 జరిమానా పడనుంది.

ఇక, ఖాతాదారులకు ఎస్ఎంఎస్ అలర్ట్ లపై నెలకు రూ.15 ఛార్జీ  చేయనున్నారు. వెయ్యి రూపాయల వరకు యూపీఐ, యూఎస్ఎస్డీ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవని, కరెంట్ అకౌంట్ ఖాతాలో కనీసం రూ.20,000 వరకు ఉండాలనే నిబంధనలతో పాటు బ్యాంకు ఖాతాలో రూ.25 వేలకు పైబడి ఉంటే ఆయా బ్యాంకుల ఏటీఎంల నుంచి ఎన్నిసార్లయినా నగదు డ్రా చేసుకోవచ్చు. దీనిపై ఎలాంటి ఛార్జీలు తీసుకోరు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేసినప్పుడు ఎటువంటి ఛార్జీ పడకుండా ఉండాలంటే అకౌంట్ హోల్డరు ఖాతాలో లక్ష రూపాయల వరకు నిల్వ ఉండాలనేది కొత్త నిబంధన.

  • Loading...

More Telugu News