: నయీమ్ తో స్నేహం ఉండేదని అంగీకరించిన మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్!


గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. నాగేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ను సిట్ అధికారులు విచారణ చేశారు. నయీమ్ తో తనకు స్నేహం ఉండేదని ఈ విచారణలో విద్యాసాగర్ తెలిపారు. ఈ మేరకు ఆయన స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. నయీమ్ భార్య ఫర్హానాతో కలిసి విద్యాసాగర్ భార్య భూమి కొన్నట్టు విచారణలో గుర్తించారు. కాగా, విద్యాసాగర్ ను ఇప్పటికే రెండుసార్లు సిట్ విచారించింది. 

  • Loading...

More Telugu News