: నాపై మళ్లీ సస్పెన్షన్ విధిస్తే సుప్రీంకోర్టుకు వెళ్తా: రోజా


తనపై మళ్లీ సస్పెన్షన్ వేటు విధిస్తే కనుక సుప్రీంకోర్టుకు వెళ్తానని వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే అనితపై రోజా చేసిన వ్యాఖ్యలకు గాను ఏడాది పాటు ఆమెను సస్పెండ్ చేశారు. ఆ గడువు ముగియడంతో.. ఆమెపై మళ్లీ సస్పెన్షన్ వేటు వేస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజా స్పందిస్తూ.. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా తనపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించారని న్యాయపోరాటం చేస్తున్నానని చెప్పారు. మళ్లీ సస్పెన్షన్ వేటు పడుతుందనే విషయమై ఆమెను ప్రశ్నించగా.. ప్రివిలేజ్ కమిటీ రిపోర్ట్ చూసిన తర్వాత కోర్టుకు వెళ్లాలో లేదో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తనను అసెంబ్లీకి అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, మళ్లీ సస్పెన్షన్ విధిస్తే సుప్రీంకోర్టుకు వెళ్తానని, తాను మహిళల్ని అవమానపరిచేంత మూర్ఖురాలిని కాదని రోజా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News