: పార్టీలో కమ్మ నేతలు చంద్రబాబును ప్రశ్నించే స్థితిలో లేరు: ఎంపీ రాయపాటి


తెలుగుదేశం పార్టీలోని కమ్మ నేతలు చంద్రబాబును ప్రశ్నించే స్థితిలో లేరని ఆ పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని కమ్మ జనసేవా సమితిలో కాకతీయ కన్వెన్షన్ కమిటీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ, కమ్మ కులాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని, గ్రామ స్థాయిలో పార్టీ కోసం పని చేసిన క్యాడర్ చాలా నిరుత్సాహంగా ఉన్నారని, ఇది పార్టీ మనుగడకు మంచిది కాదని హెచ్చరించారు.

పార్టీ కోసం కష్టపడే వారిని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో తాను చాలా జూనియర్ ని అని, అందుకే, చంద్రబాబును గట్టిగా ప్రశ్నించలేకపోతున్నానని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇకపై ప్రత్యక్ష ఎన్నికలలో తాను పోటీ చేయనని, తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని రాయపాటి స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News