: రేపు ఏపీ బీఏసీ మీటింగ్... జగన్ కోసం గెస్ట్ హౌస్ ను సిద్ధం చేసిన చంద్రబాబు సర్కారు
ఎల్లుండి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు వెలగపూడిలో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు సమావేశం జరగాలన్న విషయమై ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. ఇక ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ జరిగినన్ని రోజులూ అమరావతి పరిసర ప్రాంతాల్లోనే వైఎస్ జగన్ ఉండేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందుకోసం విజయవాడలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ను అధికారులు సిద్ధం చేశారు. ఎమ్మెల్యేల కోసం పలు స్టార్ హోటళ్లలో రూములను ఇప్పటికే బుక్ చేశారు. అసెంబ్లీ ఉన్న వెలగపూడి పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న 35 కిలోమీటర్ల రహదారినీ జల్లెడ పడుతున్నారు. జాతీయ రహదారి నుంచి వెలగపూడికి దారితీసే అన్ని మార్గాలనూ తమ అధీనంలోకి తీసుకున్నారు.