: ఇక ఇంటర్వ్యూలు ఉండవు... ఏపీ గ్రూప్-2లో మార్కుల మెరిట్ తోనే ఉద్యోగాలు


ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2లో మార్కుల మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వనున్నామని, ఎటువంటి ఇంటర్వ్యూలూ ఉండవని ఏపీ పీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. ఈ ఉదయం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీ పీఎస్సీ ద్వారా గత ఆరు నెలల్లో 32 నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. ఈ నోటిఫికేషన్ల ద్వారా 4,275 మంది ఉద్యోగులను ఎంపిక చేయనున్నామని అన్నారు. గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను 20 రోజుల్లో విడుదల చేస్తామని, మే 20, 21 తేదీల్లో గ్రూప్-2 మెయిన్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. పరీక్ష జరిగే స్పష్టమైన తేదీని తరువాత ప్రకటిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News