: 'అఖిల్ పెళ్లి రద్దు'పై మరోసారి తప్పించుకున్న అమల!


ఈ ఉదయం షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాదు, నక్లెస్ రోడ్డులో జరిగిన 5కే రన్ లో పాల్గొన్న నటి అమల, తన కుమారుడు అఖిల్, శ్రేయాల వివాహం రద్దయిన విషయమై స్పందించకుండా మరోసారి తప్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమలను అఖిల్ వివాహంపై ప్రశ్నించేందుకు మీడియా ఆసక్తి చూపగా, ఆమె సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. అంతకుముందు ఆమె మాట్లాడుతూ, మహిళల సంక్షేమం కోసం షీ టీమ్స్ ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడాన్ని తాను అభినందిస్తున్నానని అన్నారు. మహిళల్లో ఆత్మ విశ్వాసం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News