: ఇక కెనడా వంతు... వీసా నిబంధనలు మార్చడంపై భారత్ ఆందోళన


తమ దేశానికి వస్తున్న విదేశీ ఉద్యోగులను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా కొత్త చట్టాలు తెస్తూ, వీసా నిబంధనలను కఠినం చేస్తున్న వేళ, భారత ఐటీ ఉద్యోగులకు మరింత ఆందోళన కలిగిస్తూ, కెనడా సైతం అదే దారిలో నడుస్తోంది. మారిన నిబంధనల మేరకు భారత కంపెనీలు స్వల్పకాల వీసాపై కెనడాకు ఉద్యోగులను పంపడం కష్టం అవుతుందని అంచనా.

ఇక దీనిపై ప్రస్తుతం కెనడా పర్యటనలో ఉన్న వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, వీసా నిబంధనలను మార్చడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, అక్కడి అధికారులతో విషయాన్ని చర్చించారు. కెనడా విదేశీ వాణిజ్య మంత్రి ఫ్రానోయిస్ ఫిలిప్పె చాంపేన్ తో నిర్మలా సీతారామన్ చర్చలు జరుపుతూ, భారత కంపెనీల భయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని ఈ సందర్భంగా చాంపేన్ హామీ ఇచ్చారని సమాచారం.

  • Loading...

More Telugu News