: రూ. 345కే 28 జీబీ డేటా, అపరిమిత కాల్స్: ఎయిర్ టెల్ తాజా ఆఫర్
రిలయన్స్ జియో నుంచి తమ కస్టమర్లను కాపాడుకోవడానికి టెలికం సంస్థలు ప్రయత్నిస్తున్న వేళ, అదే దారిలో నడుస్తున్న ఎయిర్ టెల్ మరో ఆకర్షణీయమైన ఆఫర్ ను తీసుకువచ్చింది. రూ. 345కు 28 జీబీ డేటాను, అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ ను అందిస్తామని పేర్కొంది. ఈ రీచార్జ్ తో పగలు 500 ఎంబీ, రాత్రి 500 ఎంబీ డేటాను 28 రోజుల పాటు అందుకోవచ్చని, రూ. 549తో రీచార్జ్ చేయించుకుంటే, పరిమితులు లేకుండా రోజుకు 1 జీబీ వాడుకోవచ్చని తెలిపింది. ఈ నెల 31లోగా రీచార్జ్ చేయించుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది.