: కొత్త నోట్లు చిరిగినా, రాతలున్నా చెల్లుతాయి... తీసుకోకుంటే జరిమానా: ఆర్బీఐ హెచ్చరిక
1999 నాటి 'క్లీన్ నోట్' పాలసీ నిబంధనల ప్రకారం బ్యాంకులు నడుచుకోవాల్సిందేనని, చిరిగిన, గీతలు, రాతలున్న నోట్లను తీసుకోకుంటే, రూ. 10 వేల వరకూ జరిమానా విధిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఇటీవలి కాలంలో కొత్త నోట్లు నలిగినా, చిరిగినా, వాటిపై రాతలు రాసినా బ్యాంకులు స్వీకరించబోవంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆర్బీఐ స్పందించింది. పాడైన నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చని తెలుపుతూ, కస్టమర్లను ఇబ్బందులు పెట్టవద్దని బ్యాంకులకు సూచించింది. అయితే, రోజుకు 20 నోట్లు లేదా రూ. 5 వేలకు మించి నోట్లను మార్చేందుకు ఎవరైనా వస్తే, సర్వీస్ చార్జీలను వసూలు చేసుకునే అధికారం బ్యాంకులకు ఉందని పేర్కొంది.