: ఆర్జేడీ నేత కోసం మద్యం తెస్తూ, అడ్డంగా దొరికిపోయిన మహిళా నేత
మద్య నిషేధం అమలులో ఉన్న బీహారులో ఆర్జేడీ నేత కోసం మద్యం తెస్తున్న ఓ మహిళా నేత పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. మాదేపురా జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఆర్జేడీ పంచాయితీ విభాగానికి ఉపాధ్యక్షురాలినని చెప్పుకున్న రేణూ యాదవ్ అనే మహిళ వాహనంలో 16 మద్యం బాటిళ్లు దొరికాయి. వీటిని ఓ సీనియర్ నేత కోసం తీసుకు వెళుతున్నట్టు ఆమెను విచారించిన పోలీసులు గుర్తించారు. ఆయన పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ ఘటనతో తమ పార్టీకి సంబంధం లేదని ఆర్జేడీ ప్రకటించింది. ఆమె వ్యవహారాలు నచ్చక పార్టీ నుంచి చాలా రోజుల క్రితమే బహిష్కరించామని, ప్రస్తుతం ఆమె సీపీఐ-ఎంఎల్ లో ఉందని తెలిపింది.