: మరింత పెరిగిన బంగారం ధర
మార్కెట్లో బంగారం ధరలు ఈ రోజు మరింత పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.375 పెరిగి రూ.30,000 మార్కును దాటేసింది. బంగారం దుకాణదారుల నుంచి డిమాండ్ పెరగడం, మరోవైపు గ్లోబల్ మార్కెట్లోనూ అమ్మకాలు ఊపందుకోవడంతో ఈ రోజు ట్రేడింగ్లో 99.9 శాతం స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర ఓ దశలో రూ.30,100 చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా వెండి ధరలు కూడా బంగారం ధర బాటలోనే పయనిస్తూ కిలో వెండి రూ.400 పెరిగింది. దీంతో ఈ రోజు కిలో వెండి ధర రూ.43,100గా నమోదైంది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటంతో వెండి ధర పైకి ఎగిసింది. గ్లోబల్ మార్కెట్లో 0.02శాతం పెరిగిన ఔన్సు బంగారం ధర 1,234.40 డాలర్లకు చేరగా, వెండి ధర 1.27 శాతం పెరిగి 17.95 డాలర్లుగా నమోదైంది.