: నా కూతురు నటి కావాలని కలలు కంటోంది.. కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా: సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రస్తుతం ‘భూమి’ చిత్రం షూటింగ్లో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆయన కుటుంబంతో గడిపేందుకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. తనకు ఎదురయిన కష్టాలు తన పిల్లలకు ఉండకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వారిపై ఆంక్షలు పెడుతున్నాడు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న తన సినిమా గురించి ఇంటర్వ్యూ ఇచ్చిన సంజయ్ దత్ చిత్రంలో తన కూతురి పాత్ర గురించి, నిజజీవితంలో తన కూతురి త్రిశల గురించి మాట్లాడాడు. 'మా త్రిశల నటి కావాలని కలలు కంటోంది. కానీ నేను తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా' అని సంజయ్ వ్యాఖ్యానించాడు. తన కూతురి చదువు కోసం ఎంతో సమయం, శక్తి కేటాయించానని ఆయన చెప్పాడు. ఆమెని ఫోరెన్సిక్ సైన్స్ చదివించాలని అనుకుంటున్నానని అన్నాడు.