: టీడీపీకి అంత దమ్ము, ధైర్యం లేవు!: ధర్మాన ప్రసాదరావు
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ చాలా దారుణంగా ఉందని వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం కోల్పోయిన టీడీపీ నేతలు, నామినేషన్లు వేసిన వారిని బెదిరిస్తూ, నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని విమర్శించారు. ఇతర పార్టీల నుంచి 20 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన టీడీపీ... ఇప్పుడు వారికి మంత్రి పదవులు ఇస్తామనడం అత్యంత దారుణమని చెప్పారు.
రాష్ట్రంలో ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము, ధైర్యం టీడీపీకి లేవని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలను కూడా తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన ఒడిశాలో 85 రోజులు, తెలంగాణలో 75 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తుంటే... ఏపీలో మాత్రం తక్కువ రోజులే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను చర్చించే వేదిక అయిన అసెంబ్లీని సక్రమంగా నిర్వహించాలని సూచించారు.