: ‘భారీ’ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జోగావత్‌కు శస్త్రచికిత్స.. ఏడాదిలో సాధారణ జీవితం!


బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల సందర్భంగా వెలుగులోకి వచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ దౌలత్‌రాం జోగావత్‌కు వైద్యులు బేరియాట్రిక్ శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం 180 కిలోల బరువున్న ఆయన ఏడాదిలోపు 80 కిలోలకు చేరుకుంటారని ఆయనకు చికిత్స అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినిమల్‌ యాక్సెస్‌ సర్జికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ చైర్మన్ డాక్టర్ ముఫజల్ లక్డావాలా తెలిపారు. అతను త్వరగా కోలుకుని అందరిలానే సాధారణ జీవితం గడుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇటీవల జరిగిన బీఎంసీ ఎన్నికల్లో దౌలత్‌రాం జోగావత్ విధులు నిర్వహించారు. ఓ కుర్చీలో కూర్చున్న ఆయనను చూసిన ప్రముఖ రచయిత్రి శోభాడే ఫొటో తీసి ‘ముంబైలో ‘భారీ’  పోలీస్ బందోబస్తు’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె వ్యాఖ్యలు తనను బాధించాయని, తాను తినడం వల్ల లావు పెరగలేదని జోగావత్ ఆవేదన వ్యక్తం చేశారు. అలా వెలుగులోకి వచ్చిన జోగావత్‌కు ఉచితంగా శస్త్ర చికిత్స చేస్తామంటూ పలు ఆస్పత్రులు ముందుకొచ్చాయి. ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినిమల్‌ యాక్సెస్‌ సర్జికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News