: 30 వేల మంది అతిథుల సమక్షంలో వైభవంగా మహారాష్ట్ర ఎమ్మెల్యే వివాహం
ఆకాశమంత పందిరి, భూదేవంత పీట .. అనడాన్ని చాలామంది వినే ఉంటారు. కానీ శుక్రవారం ముంబైలో జరిగిన ఎమ్మెల్యే వివాహంలో ఇది ప్రత్యక్షంగా చూశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి పలువురిని ఆకర్షించింది. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రావు సాహెబ్ ధాన్వే కుమారుడు, బోకర్దాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సంతోష్, ప్రముఖ మరాఠా సంగీతకారుడు రాజేష్ సర్కటే కుమార్తె రేణుల వివాహం కనులపండువగా జరిగింది. ఈ పెళ్లిని తిలకించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, మంత్రులు, ప్రముఖులు సహా 30 వేల మందికిపైగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అతిథులకు భారత్, చైనా వంటకాలను తయారుచేయించి వడ్డించారు. పోలీసులు డ్రోన్ కెమెరాలు ఉపయోగించి భద్రతను పర్యవేక్షించారు.