: ట్రాఫిక్ పోలీసు అధికారులతో ఘర్షణపడ్డ పాకిస్థాన్ క్రికెటర్


పాకిస్థాన్ స్పెషలిస్టు బ్యాట్స్ మన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ట్రాఫిక్ పోలీసులతో రెండోసారి వాగ్వాదానికి దిగాడు. కమ్రాన్ అక్మల్ మైదానంలో అయినా, బయట అయినా దూకుడుగా ఉంటాడు. అలాంటి అక్మల్ లాహోర్ లో కారులో వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసు అడ్డుకున్నాడు. నెంబర్ ప్లేటు సరైనది కాదంటూ కారును ఆపాడు. దీంతో కమ్రాన్ అక్మల్ కి కోపం నషాళానికి అంటింది. ట్రాఫిక్ పోలీసులను చడమడా తిట్టేశాడు. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి కారు నెంబర్ ప్లేటు నిబంధనలకు అనుగుణంగా లేదని చెబుతూ, నడిరోడ్డుపైనే దానిని మార్పించారు. దీంతో నెంబర్ ప్లేటు మార్చేంతవరకు కమ్రాన్ అక్మల్ కారులోనే డోర్లు వేసుకుని కూర్చున్నాడు. దీనిని ఓ అభిమాని వీడియోతీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


  • Loading...

More Telugu News