: ఏపీలో దోమల నివారణకు హైటెక్ యుద్ధం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోమల నివారణకు ఏపీ ప్రభుత్వం హై-టెక్ యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘స్మార్ట్ మస్కిటో డెన్సిటీ సిస్టమ్’ ప్రతిపాదనను అనుమతించాలని కేంద్ర అర్బన్ డెవలప్ మెంట్ మంత్రిత్వ శాఖను కోరడం జరిగింది. ఈ పద్ధతి ద్వారా స్మార్ట్ ఫోన్లు, వెబ్ ఆధారిత అప్లికేషన్స్ ను వినియోగించనున్నారు. ఆప్టికల్ సెన్సర్స్ ను ఉపయోగించి దోమల రకాలు, వాటి తీవ్రత, జెండర్ కు సంబంధించిన విషయాలను తెలుసుకుంటారు. ‘స్మార్ట్ మస్కిటో డెన్సిటీ సిస్టమ్’ ప్రతిపాదన అమలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే కనుక రూ.4 కోట్ల వరకు ఏపీ సర్కార్ ఖర్చు చేయాల్సి ఉంటుంది.