: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పరాభవం తప్పదు: టీడీపీ నేతలు
ఏపీలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమిపాలు కాక తప్పదని టీడీపీ నేతలు జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీటెక్ రవి గెలుపు ఖాయమని, రవి గెలిస్తే కనుక కడప జిల్లా వైఎస్సార్సీపీ నేతలు రాజీనామా చేస్తారా? అని వారు ప్రశ్నించారు. గతంలో పోటీ చేసిన జగన్ తల్లి వైఎస్ విజయమ్మ నాడు పరాజయం పాలైందని, ఇప్పుడు జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి వంతు వచ్చిందని అన్నారు.