: మాది అదే టీమ్... సిరీస్ గెలవాలంటే ఏం చేయాలో మాకు తెలుసు!: స్టీవ్ స్మిత్
రేపటి నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ లో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. తొలి టెస్టులో విజయం సాధించిన జట్టుతోనే రెండో టెస్టును కూడా ఆడనున్నామని చెప్పాడు. తమ ఆటగాళ్లంతా రెండో టెస్టు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నాడు. ఈ టెస్టులో విజయం ఎంత ముఖ్యమో తమకు తెలుసని స్మిత్ అన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. అందుకు రెండో టెస్టులో విజయం సాధించడం చాలా అవసరమని అన్నాడు. రెండో టెస్టులో భారీ స్కోర్లు చేసేందుకు తమ బ్యాట్స్ మన్ సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. టాస్ గెలిస్తే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంటామని స్మిత్ వెల్లడించాడు.