: హార్డిక్ పాండ్య స్థానంలో కొత్త కుర్రాడిని తీసుకుంటాం: కోహ్లీ
రేపటి నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో ఊహించని నిర్ణయాలు తీసుకుంటామని కోహ్లీ తెలిపాడు. బెంగళూరులో మాట్లాడుతూ, తొలి టెస్టులో రాణించనంత మాత్రాన జట్టు ప్రదర్శనపై ఒక అంచనాకు రావద్దని సూచించాడు. తొలి టెస్టు ఫలితం పునరావృతం కాదని కోహ్లీ భరోసా ఇచ్చాడు. రెండో టెస్టులో గాయపడ్డ హార్డిక్ పాండ్య స్థానంలో కొత్త కుర్రాడిని తీసుకుంటామని చెప్పాడు.
పూణే టెస్టులో విఫలమైనంత మాత్రాన జయంత్ యాదవ్ లో ప్రతిభ లేదని భావించవద్దని కోహ్లీ సూచించాడు. తుది జట్టు కూర్పుపై జట్టు సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నాడు. ఈసారి సర్ ప్రైజింగ్ నిర్ణయాలు ఉంటాయని కోహ్లీ తెలిపాడు. స్మిత్ మైండ్ గేమ్ ను అర్థం చేసుకోగలమని కోహ్లీ తెలిపాడు. రెండో టెస్టులో విజయమే లక్ష్యమని, ఆ దిశగా ప్రాక్టీస్ చేశామని కోహ్లీ చెప్పాడు. వ్యూహాలు సరిగ్గా అమలు చేయగలిగితే విజయం తమదేనని తెలిపాడు.