: చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కవిత


ఏపీ అసెంబ్లీ తొలి సమావేశంలోనే తెలంగాణపై ముఖ్యమంత్రి చంద్రబాబు విషం కక్కారని టీఆర్ఎస్ ఎంపీ కవిత మండిపడ్డారు. రాష్ట్ర విభజన ఎంతో ఆవేదనను, బాధను కలిగించిందంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు... తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని విమర్శించారు. తెలంగాణపై చంద్రబాబుకు ఎంత ఆక్రోశం ఉందో ప్రజలు గమనించాలని అన్నారు. తెలంగాణలో ఉండే నైతిక హక్కు టీడీపీకి లేదని చెప్పారు. తెలంగాణలో ఉండే అర్హత టీడీపీకి లేదనే విషయాన్ని ఆయనే నిరూపించుకుంటున్నారని అన్నారు. 

  • Loading...

More Telugu News