: రాజమండ్రి ఎయిర్ పోర్టుకు ఈ పేరు పెట్టండి!: మురళీమోహన్ సూచన
రాజమండ్రి ఎయిర్ పోర్టుకు దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి పేరు పెట్టాలని ఎంపీ మురళీమోహన్ కోరారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని ఆయన అన్నారు. ఈరోజు రాజమండ్రిలో బాలయోగి వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మురళీమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంత అభివృద్ధికి బాలయోగి ఎంతో కృషి చేశారని కొనియాడారు.