: హైదరాబాదే నా రెండో ఇల్లు అనిపిస్తోంది: ప్రగ్యా జైస్వాల్


గత ఆరు నెలల నుంచీ హైదరాబాద్ లోనే గడుపుతున్నానని, హైదరాబాదే తన రెండో ఇల్లు అనిపిస్తోందని యువ కథానాయిక ప్రగ్యా జైస్వాల్ అభిప్రాయపడింది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, హైదరాబాద్ లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందని చెప్పింది. ముఖ్యంగా, భోజన ప్రియులకు హైదరాబాద్ ని మించింది లేదని, హైదరాబాద్ బిర్యానీ చాలా బాగుందని ప్రగ్యా కితాబిచ్చింది. వైట్ రైస్ తినాలంటే విసుగు అనిపించినా, ఆ తర్వాత, ఇదే చాలా రుచిగా ఉందని మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు చెందిన ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చింది. కాగా, మంచు మనోజ్ సరసన ఆమె నటించిన కొత్త చిత్రం ‘గుంటూరోడు’ ఈ రోజు విడుదలైంది.   

  • Loading...

More Telugu News