: మీడియాపై సంజయ్ దత్ బాడీగార్డుల దాడి.. పోలీస్ కేసు నమోదు!
బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌పై ఈ రోజు మరో కేసు నమోదైంది. ఆయన ఓ కీలక పాత్రలో ‘భూమి’ చిత్రంలో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగ్రాలో కొనసాగుతోంది. అయితే, ఆ సినిమా సెట్లోకి మీడియా ప్రతినిధులు అనుమతి లేకుండా ప్రవేశించారన్న ఆరోపణలతో ఆయన బాడీగార్డులు వారిపై దాడి చేశారు. దీంతో సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు దర్శకుడు, నిర్మాత ఆదేశించడంతోనే తమను సంజయ్ బాడీగార్డులు కొట్టారని విలేకరులు చెబుతున్నారు. తమపై వారు దుర్భాషలాడారని కూడా విలేకరులు తెలిపారు. ‘భూమి’ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.