: హెయిర్ స్టయిలిస్ట్ పై అత్యాచారయత్నం చేసింది కానిస్టేబులే!
విజయవాడ వెళ్లేందుకు హైదరాబాదులోని ఎల్బీనగర్ వద్ద వేచి ఉన్న ఓ మహిళా హెయిర్ స్టయిలిస్ట్ ను నమ్మించి, క్యాబ్ లోకి ఎక్కించుకుని, ఆమెపై ఇద్దరు అత్యాచారయత్నం చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఈమె గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోందని భావించినప్పటికీ... ఆ తర్వాత ఆమె ఓ హెయిర్ స్టయిలిస్ట్ అని గుర్తించారు. ఎల్బీ నగర్ నుంచి కొంచెం దూరం వెళ్లాక ఆమెపై అత్యాచార యత్నం చేశారు. ఈ క్రమంలో, చౌటుప్పల్ దాటాక ఓ టోల్ గేటు వద్ద ఆమె కారు నుంచి కిందకు దిగి రక్షించమంటూ కేకలు వేసింది. దీంతో, టోల్ గేటు సిబ్బంది ఆమెను కాపాడి, కారులోని వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితుల్లో ఒక వ్యక్తిని ఏఆర్ కానిస్టేబుల్ గా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న జనాలు... పోలీసులే ఇలాంటి పనులకు తెగబడితే తమకు రక్షణ ఎక్కడ ఉంటుందంటూ మండిపడుతున్నారు.