: అరుణాచల్ ప్రదేశ్ మాకివ్వండి... తవాంగ్ ను మీకిస్తాం!: భారత్ తో సరిహద్దులు మార్చుకునేందుకు సిద్ధమంటున్న చైనా!


ఈశాన్య భారతావనిలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదని దశాబ్దాల కాలంగా వాదిస్తున్న చైనా నుంచి వింతైన ప్రతిపాదన వచ్చింది. తామడుగుతున్న అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోని కొంత భాగాన్ని తమకిస్తే, అందుకు ప్రతిగా తవాంగ్ లోని అంతే భూభాగాన్ని ఇండియాకు ఇస్తామని తెలిపింది. ఈ మేరకు సరిహద్దులు మార్చుకునేందుకు సిద్ధమన్న సంకేతాలను పంపింది. ఇండియాతో చర్చల నిమిత్తం ఏర్పాటు చేసిన సరిహద్దుల సంప్రదింపుల కమిటీ హెడ్ దాయ్ బింగువో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇండియా - చైనాలు సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా తుది అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందని, బీజింగ్ కేంద్రంగా ప్రచురితమవుతున్న ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. టిబెట్ బౌద్ధులు అధికంగా ఉన్న తవాంగ్ మొనాస్ట్రీ ప్రాంతాన్ని ఇండియాకు ఇస్తామని, అరుణాచల్ లోని చైనా కోరుకుంటున్న భూభాగాన్ని ఇస్తే, సమస్య అత్యంత సులువుగా పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ ఆలోచించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News