: పోలీసులపై ప్రైవేటు కేసు.. గన్నవరం కోర్టుకు హాజరైన రోజా!
వైకాపా ఎమ్మెల్యే రోజా ఈ ఉదయం గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు హాజరయ్యారు. మహిళా పార్లమెంట్ సదస్సుకు తాను వెళుతుండగా, ఎయిర్ పోర్టులో పోలీసులు తనను అడ్డుకున్నారని ఆమె వేసిన పిటిషన్ విచారణకు రాగా, తన వాదన వినిపించేందుకు ఆమె కోర్టుకు వచ్చారు. రెండు వారాల క్రితం తనను అడ్డుకున్న పోలీసులపై ప్రైవేటు కేసును రోజా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేసు విచారణను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన కోర్టు, తదుపరి విచారణను వాయిదా వేసింది.