: పరువునష్టం కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు పంపిన నాంపల్లి కోర్టు
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో పరువునష్టం కేసు నమోదైంది. మైహోం గ్రూప్ అధినేత రామేశ్వర్ రావు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బంధువైన రామేశ్వర్ రావుకు హైదరాబాదులో అక్రమంగా భూములను కట్టబెట్టారంటూ రేవంత్ రెడ్డి గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వ్యాఖ్యలతో సమాజంలో తన పరువు పోయిందని... అందువల్ల రేవంత్ తనుకు రూ. 90 కోట్లు చెల్లించాలంటూ రామేశ్వర్ రావు లీగల్ నోటీసులు పంపారు.
రామేశ్వర్ రావు పిటిషన్ ను కోర్టు ఈ రోజు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా రామేశ్వర్ రావు వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్ చేసింది. అనంతరం, ఈ అంశంపై సమాధానమివ్వాలంటూ రేవంత్ రెడ్డికి నోటీసులు పంపింది.