: వైట్‌హౌస్‌ మీడియాకు హాలీవుడ్‌ నటుడి బహుమతి!


కాఫీలో ఉండే కెఫీన్‌ శరీరాన్ని ఉత్తేజపరుస్తుంద‌ని పేర్కొంటూ ప్ర‌ముఖ హాలీవుడ్‌ నటుడు టామ్‌ హ్యాంక్స్ అమెరికా అధ్య‌క్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌ మీడియాకు ఎస్ ప్రెస్సో కాఫీ మేకర్లు బ‌హూక‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాఫీ తాగితే మీడియా ప్రతినిధులు సత్యం, న్యాయం కోసం పోరాడగలుగుతారని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేర్కొన్నారు. ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ త‌రుచూ మీడియాపై మండిప‌డుతుంటార‌న్న విష‌యం తెలిసిందే.

ఇంత‌కు ముందు కూడా ఆయ‌న వైట్‌హౌస్ ‌కు కాఫీ మేక‌ర్ల‌ను బ‌హూక‌రించారు. అయితే, ఈ సారి ఆయ‌న ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. అమెరికా అధ్యక్షుడిగా జార్జి బుష్‌ ఉన్నప్పుడు కూడా  టామ్‌ హ్యాంక్స్ వైట్‌హౌస్‌ మీడియాకు ఇలాంటి కాఫీ మేకర్లు ఇచ్చారు. అనంత‌రం బరాక్‌ ఒబామా ఉన్నప్పుడు కూడా కాఫీ మేకర్లు పాడైపోయానని తెలిసి వాటి స్థానంలో కొత్తవి తెప్పించారు.

  • Loading...

More Telugu News